![]() |
![]() |

తేజస్వినికి ఏమయ్యిందో కానీ హాస్పిటల్ బెడ్ మీద పిచ్చి చేష్టలు చేస్తూ ఎటో చూస్తున్న ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది తేజస్విని మాదివాడ.. డెంటల్, మెంటల్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్లో చేరినట్లుగా కాప్షన్ పెట్టుకుంది. ఐతే ఆమె వేసుకున్న జీన్ ప్యాంట్ మోకాలి దగ్గర చింపేసుకుని కనిపించేసరికి ఒక నెటిజన్ వెరైటీగా కామెంట్ చేసాడు. "మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ అని బ్రెయిన్ ఉన్న ప్లేస్ ని ఇలా ఓపెన్ గా పెట్టారా" అంటూ ఇన్ డైరెక్ట్ గా మోకాల్లో బ్రెయిన్ ఉంది అన్న అర్ధం వచ్చేలా కామెంట్ చేసారు. ఇంకో నెటిజన్ మాత్రం "బాధపడకండి..అంతా బాగుంటుంది" అని విష్ చేశారు. ఇక తేజస్విని తాను హాస్పిటల్ కి వెళ్లడమే కాదు డెంటిస్ట్ అవతారం ఎత్తింది.
పళ్ళను చెక్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని పట్టుకునేసరికి హాస్పిటల్ కి వచ్చిన పిల్లాడు నోరు తెరిచి కూర్చున్నాడు. ఈ ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుని " ఈ పిల్లాడు నేను డెంటిస్ట్ ని అనుకుంటున్నాడు" అంటూ ఫన్నీ కామెంట్ పెట్టుకుంది. ఏదేమైనా తేజస్విని చేసిన పిచ్చి చేష్టలతో పిల్లాడు కూడా ఆమె డాక్టర్ అనుకున్నాడు మరి. తేజస్విని "ఐస్ క్రీమ్", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి మూవీస్ తో పాపులర్ అయ్యింది.
తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి ఆమె మీద చాలా నెగటివిటీ పోట్రె అయ్యింది. దానికి కారణం బిగ్ బాస్ హౌస్ లోని మరో కంటెస్టెంట్ కి చెందిన ఆర్మీ అని ఆ టైంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా కాలం ఇంట్లోంచి బయటకు రాలేదంటూ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇక రీసెంట్ గా బీబీ జోడి డాన్స్ షోలో అఖిల్ తో కలిసి తేజు రచ్చ చేసిన సంగతి తెలిసిందే...
![]() |
![]() |